Wednesday 22 January 2014

ఎదో బాధ గుండెను పిండేస్తోంది 
చాలా కోపంగా ఉంది 
నిస్సహాయత 
ఏమి చెయ్యలేని నిస్సహాయత 
చిన్నప్ప ,భారతమ్మల
గుండె లోతుల్లోని బాధ
తెలుస్తున్నా 
కారణం ఎవరో తెలిసినా
శపించలేని 
రక్త సంబంధం 
నా 
బిడ్డ మూలంగా నేను 
వాళ్ళల్లా 
బాధపడుతానని ముందుగ 
తెలిస్తే 
చచ్చిపోతాను 
కానీ 
ఇలా మాత్రం 
బతకను 
అమ్మ నోటివెంటా
ఇదే మాట 
ఏమి చెయ్యాలో 
అర్థం కావట్లేదు 
కొడుకు 
స్థాన్నాన్ని 
మేము ఎంత ప్రత్నించినా 
భర్తీ చెయ్యలేకున్నాము 
ఒక్కరింగ్ కే 
ఫోన్ ఎత్తుతున్నాడు 
అని 
ఆనందంగా 
చెప్పుకొనే 
వాళ్ళ కడుపుకోత 
నాకు మాత్రమె తెలుసు 
కానీ 
ఇలా ఏడవడం 
తప్ప ఏమి చేయలేని 
నా 
నిస్సహాయత 


Wednesday 25 December 2013

నాన్న

పీడకల ఒక్కసారిగా కుదిపి
లేపితే
ఆంజనేయ దండకం
గుర్తు రాదే
నాన్నే
నాన్నను తలవగానే
భయం ఛాయకూడ
దరిచేరదు ...

ఆడపిల్ల పుట్టింది అనగానే
మా అమ్మ
అంటూ
గుండెలకు హత్తుకొన్న
నాన్న

తన స్తోమతకు మించి
సంబరాలు ,
జరిపిన
నాన్న

తలనీలాలు ఇచ్చిన క్షణం
నేనెక్కడ బయపడుతానో
నని
దూరంగా నిలిచి
మురిపెంగా చూసుకొన్న
నాన్న

మాతో ఆటపాటలాడి
స్నేహితుడైన
నాన్న

రక్షణ కవచంలా
వెన్నంటే ఉండి
మంచి చెడులు నేర్పిన
నాన్న

అత్తారింటి ఆరల్లకు
నలుగుతున్న బిడ్డను
చూసి
కంటికి ఏకదాటిగా
అహోరాత్రులు
ఏడ్చిన
నాన్న

బతుకు భారమై
చావే శరణ్యమయ్యి
చస్తుంటే
రెండు చేతులతో
ఎత్తుకొన్న నాన్నతో
బతికించు నాన్నా
అంటుంటే
తను చస్తూ
నన్ను బ్రతికించుకొన్న
నాన్న


క్షణం
తాగుడుకు
బానిసై
మమ్మల్నే ద్వేషిస్తుంటే
మా ధైర్యం ,మా సంతోషం
అన్ని కోల్పోయి
ప్రతి క్షణం తనని
ద్వేషిస్తూ
జీవించలేకున్నాము

కానీ నాన్నా ,

ఇప్పటికీ
 నీ
గుండె గూటిలో
గువ్వపిల్లలమే
నాన్న
మేము !!!!!!!!!!!!

Sunday 22 December 2013

Thursday 28 November 2013

మా పాప కిరణ్మయి హాఫ్ సారీ ఫంక్షన్ .